ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు కనుగొన్న చైనా..! 22 d ago
చైనాలోని పింగ్జియాంగ్ ప్రాంతంలోని ఈశాన్య హునన్ కౌంటీ 'వాంగ్జు గోల్డ్ ఫీల్డ్ లో దాదాపు 2 కిలోమీటర్ల లోతులో 3డీ జియోలాజికల్ మోడలింగ్ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించి ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిక్షేపాలను కనుగొన్నారు. దానిలో దాదాపు 1000 మెట్రిక్ టన్నులు లభ్యం అవుతుందని, దాని విలువ 83 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7 లక్షల కోట్లు) ఉంటుందని జియాలాజికల్ బ్యూరో ఆఫ్ హునన్ ప్రావిన్స్ అంచనా వేసింది. 2000 మీటర్ల రేంజ్లో ఉన్న ప్రతి మెట్రిక్ టన్ను ధాతువులో దాదాపు 138 గ్రాములు (5 ఔన్సులు) బంగారం ఉంటుందని శాంపిళ్ల ద్వారా వెల్లడైంది.చైనా ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపనుందా..?ప్రస్తుతం చైనా, ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం సరఫరాదారుగా ఉంది. 2023లో ప్రపంచం మొత్తంలో దాదాపు 10శాతం బంగారం ఈ దేశం నుంచే వచ్చింది. అయినా అది చైనా అవసరాలకు సరిపోవడం లేదు. దాదాపు మూడింట రెండొంతులకు పైగా బంగారాన్ని చైనా దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇటీవల కొనుగొన్న బంగారం నిల్వలు చైనాకు దిగిమతి చేసుకునే అవసరం తగ్గుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీలో కూడా కీలకంగా ఉపయోగించే ఈ లోహం సరిపడా ఉంటే చైనాకు ఇబ్బంది ఉండదు. అత్యాధునిక చిప్‌లను తయారు చేయడానికి అమెరికాతో చైనా పోటీ పడుతుంది. అలాంటి సమయంలో ఈ గోల్డ్ రిజర్ను చైనాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద బంగారు గని సౌత్ ఆఫ్రికాలోని 'సౌత్ డీప్ మైన్'. ఈ గనిలో 930 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఇటీవల చైనాలో గుర్తించిన మైన్ వాంగ్జు గోల్డ్ ఫీల్డ్ ఈ రికార్డును అధిగమించింది.
ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద నిక్షేపాలు:
1. సౌత్ డీప్ గోల్డ్ మైన్-సౌత్ ఆఫ్రికా
2. గ్రాస్ బర్గ్ గోల్డ్ మైన్ -ఇండొనేషియా
3. ఒలింపియడా గోల్డ్ మైన్- రష్యా
4. లిహిర్ గోల్డ్ మైన్-పాపువా న్యూ గినియా
5. నోర్డే అబియార్డో గోల్డ్ మైన్-చిలీ
6. కార్లీన్ ట్రెండ్ గోల్డ్ మైన్-యూ ఎస్ ఏ.
7. బోడింగ్టన్ గోల్డ్ మైన్-పశ్చిమ ఆస్ట్రేలియా
8. ఎంపోనెంగ్ గోల్డ్ మైన్- సౌత్ ఆఫ్రికా
9. ప్యూబ్లో వీజో గోల్డ్ మైన్-డొమినికన్ రిపబ్లిక్
10. కోర్టేజ్ గోల్డ్ మైన్- యూ ఎస్ ఏ
భారతదేశంలో కొన్ని ప్రసిద్ధ బంగారం గనులు:
1. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)-కర్ణాటక
2. హట్టి గోల్డ్ మైన్స్- కర్ణాటక
3. సోన్‌భద్ర-ఉత్తరప్రదేశ్
4. గణజూర్ గోల్డ్ మైన్-కర్ణాటక
5. జొన్నగిరి గోల్డ్ మైన్-ఆంధ్రప్రదేశ్
6. లావా గోల్డ్ మైన్స్-జార్ఖండ్